సముదాయ జ్ఞాన సేకరణలను నిర్మించడం మరియు పునరుద్ధరించడంపై ఒక సమావేశం

Please click here to see this page in English

ಈ ಪುಟವನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡಲು ಇಲ್ಲಿ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.

ഈ പേജ് മലയാളത്തിൽ കാണാൻ ഇവിടെ ക്ലിക്ക് ചെയ്യുക.

இந்தப் பக்கத்தைத் தமிழில் காண இங்கே சொடுக்கவும்.

CoArchives Poster

భావన

ఆదివాసీ ప్రజలు మరియు స్థానిక సముదాయాలు (ఇండీజీనస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ - ఐ పి ఎల్ సీస్) అనే పదం తమను తాము ఆదివాసీలుగా గుర్తించుకునే, ఒక నిర్దిష్ట స్థానిక సముదాయానికి చెందిన ప్రజలను సూచిస్తుంది. ముఖ్యంగా, తమ భూములు, అడవులు, నీటి వనరులు మరియు పర్యావరణంతో చాలా కాలంగా సామాజిక, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న ప్రజలను ఇది సూచిస్తుంది. భారత ప్రభుత్వం “ఇండీజీనస్ /స్వదేశీ” అనే పదాన్ని ఉపయోగించడం, దాని అర్థం మరియు వినియోగంపై ఇంకా చర్చ కొనసాగుతున్నప్పటికీ, ఈ పదాన్ని సామాజికంగా విస్తృతంగా ఉపయోగించే ‘ఆదివాసీ’ అనే పదంతో తరచుగా అనుసంధానిస్తున్నారు. భారతదేశంలో ఆదివాసీలను ఉద్దేశించిన ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవడానికి షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పరిపాలనా వర్గాన్ని ఉపయోగిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, 10.4 కోట్లకు పైగా ప్రజలు, అంటే దేశ జనాభాలో సుమారు 8.6 శాతం మంది, షెడ్యూల్డ్ ట్రైబ్‌లకు చెందినవారు. అయితే, సంచార మరియు డీనోటిఫైడ్ తెగలు (డిఎన్టీస్), అలాగే ఐ పి ఎల్ సీస్ అనే విస్తృత భావనలోకి వచ్చే గుర్తింపు పొందని ఇతర సముదాయాల స్థితి, గుర్తింపు మరియు ప్రాతినిధ్యం గురించి భారతదేశంలో ఇప్పటికీ చాలా తక్కువ సమాచారం ఉంది.

భారతదేశంలోని ఆదివాసీ ప్రజలు మరియు స్థానిక సముదాయాలు అనేక రకాల జ్ఞాన సంప్రదాయాలను కలిగి ఉన్నారు. భూమి, జీవవైవిధ్యం, జీవనోపాధి, సంస్కృతి మరియు సముదాయ జీవనంతో వారికి ఉన్న సంబంధాల ద్వారా ఈ జ్ఞానం తరతరాలుగా అభివృద్ధి చెంది, ఒక తరం నుంచి మరో తరానికి చేరింది. ఈ సముదాయాల వద్ద గొప్ప చరిత్రలు, భాషలు, పర్యావరణ జ్ఞానం, పాటలు, కథలు, అలాగే భూమి మరియు జీవంతో సంబంధం కలిగి ఉండే ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ఈ జీవంతమైన జ్ఞానం వారి గుర్తింపు మరియు జ్ఞాపకాలతో గాఢంగా ముడిపడి ఉంది.

నేడు ప్రభుత్వాలు, పరిశోధకులు, సంస్థలు మరియు వ్యక్తులు ఈ జ్ఞానంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే, సముదాయాలను జ్ఞానానికి సంరక్షకులుగా, నిర్ణయాలు తీసుకునే వారిగా చూడటానికి బదులుగా, వారిని తరచుగా పరిశోధనకు సంబంధించిన వ్యక్తులుగా లేదా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులుగా మాత్రమే చూశారు. కొన్ని సందర్భాల్లో, సముదాయాల పూర్తి అవగాహన, సమ్మతి లేదా భాగస్వామ్యం లేకుండానే వారి జ్ఞానాన్ని నమోదు చేసి, ఇతరులతో పంచుకున్నారు. అనేక సందర్భాల్లో, తమ గురించి రికార్డులు, ఫోటోలు లేదా డేటా ఆర్కైవ్‌లు మరియు ఇతర సేకరణల్లో ఉన్నాయనే విషయం కూడా సముదాయాలకు తెలియదు. ఇలాంటి రికార్డులు కొన్నిసార్లు సముదాయ చరిత్రలు, సాంస్కృతిక ఆచారాలు, పర్యావరణ జ్ఞానం, హక్కులు మరియు గుర్తింపు కోసం జరుగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడవచ్చు. అయితే, అవి సముదాయాలను తప్పుగా చూపించవచ్చు, జ్ఞానాన్ని దాని అసలు సందర్భం నుంచి వేరు చేయవచ్చు లేదా సముదాయం ముందస్తు సమ్మతి లేకుండానే సాంస్కృతికంగా సున్నితమైన జ్ఞానానికి ఇతరులకు ప్రాప్యత కల్పించవచ్చు. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో సముదాయాలు, కలెక్టివ్‌లు మరియు ఈ రంగంలో పనిచేస్తున్నవారు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అడగడం ప్రారంభించారు:

  • మన చరిత్రలు మరియు జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నాయి?
  • వాటిని ఎలా ఉపయోగించాలి లేదా పంచుకోవాలి అనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
  • భవిష్యత్ తరాల కోసం వాటిని మన స్వంత పద్ధతుల్లో ఎలా కాపాడుకోవచ్చు?

ఈ చర్చల ద్వారా ఆర్కైవ్‌లు మరియు జ్ఞాన సేకరణలను స్వీయ ప్రాతినిధ్యం మరియు స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థలాలుగా కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం పాత రికార్డులను కాపాడటం మాత్రమే కాకుండా, తమ జ్ఞానాన్ని ఎలా నమోదు చేయాలి, ఎలా చూసుకోవాలి, ఎలా పంచుకోవాలి అనే విషయాల్లో సముదాయాలకు అర్థవంతమైన పాత్ర ఉండాలని ఈ చర్చలు సూచిస్తున్నాయి. ఇందులో సున్నితమైన సమాచారాన్ని రక్షించడం, తరతరాల మధ్య జ్ఞానాన్ని పంచుకోవడాన్ని బలోపేతం చేయడం, అలాగే సముదాయాలు తమ స్వంత ఆర్కైవ్‌లను నిర్మించుకుని నిర్వహించుకునేలా సహాయం చేయడం ముఖ్యమైన అంశాలు. డిజిటల్ సాంకేతికతలు మరియు కృత్రిమ మేధస్సు (ఏఐ) డేటా వినియోగాన్ని వేగంగా పెంచుతున్న ఈ సమయంలో ఇది మరింత ముఖ్యమైంది. సముదాయ జ్ఞానం ఎలా ఉపయోగించబడుతోంది, ఎలా తిరిగి ఉపయోగించబడుతోంది అనే విషయం ఎల్లప్పుడూ సముదాయాలకు తెలియకపోవచ్చు. దానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారో కూడా స్పష్టంగా ఉండకపోవచ్చు. ఆర్కైవ్‌లను తిరిగి తమ చేతుల్లోకి తీసుకోవడం అంటే జ్ఞానం భవిష్యత్తులో ఎలా గౌరవం, సమ్మతి మరియు సామూహిక నియంత్రణతో ప్రయాణించాలి అనే విషయాన్ని కూడా సముదాయాలే నిర్ణయించుకోవడం

సాహిత్య సూచిక

Ahammad, R., Sangha, K., Evans, J., & Metcalfe, O. (2026). Revisiting the Definition and Recognition of Indigenous Peoples and Local Communities for Biodiversity Conservation. Ecology and evolution, 16(2), e72958. https://doi.org/10.1002/ece3.72958

Bijoy, C. R., & Nongbri, T. (2013). Country technical note on Indigenous Peoples’ issues: Republic of India. International Fund for Agricultural Development (IFAD).

Dhir, R. K. (2015). Indigenous peoples in the world of work in Asia and the Pacific: A status report. International Labour Organization.

Linggi, T. (Ed./Auth.). (2024). The Idu Mishmi Code of Research Ethics (IMCRE) (2nd ed., 2025). Idu Mishmi Cultural and Literary Society (IMCLS).

Salar, N., & Murthy, S. (2023). The exploited yet legally underappreciated apparel domain of indigenous communities: Tracing WIPO’s efforts and ongoing challenges. The Journal of World Intellectual Property, 26, 312–327. https://doi.org/10.1111/jwip.12266

Shankar, P. (2026, July 6). Indigenous communities missing in India’s report on Access and benefit sharing [commentary]. Mongabay India. https://india.mongabay.com/2026/07/indigenous-communities-missing-in-indias-report-on-access-and-benefit-sharing-commentary/

కార్యక్రమ వివరాలు

తేదీ: 30 మరియు 31 జూలై 2026

సమయం: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:00 వరకు.

స్థలం: పతంజలి సెమినార్ హాల్, ది యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్-డిసిప్లినరీ హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (టిడియు), బెంగళూరు.

విధానం: ప్రత్యక్ష సమావేశాలు, చిన్న సమూహ చర్చలు, కథలు పంచుకోవడం, కలిసి చేసే కార్యక్రమాలు మరియు బహిరంగ సంభాషణ.

భాషలు: ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, తెలుగు మరియు తమిళం.

ఆయోజకులు: అంతర అడ్వైసరి, ఆర్కైవ్స్ ఎట్ ఎన్ సి బి ఎస్, కీస్టోన్ ఫౌండేషన్, మిల్లి ఆర్కైవ్స్ ఫౌండేషన్ మరియు ది యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్-డిసిప్లినరీ హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (టిడియు).

గ్రాంట్ సహాయం: మిల్లి ఆర్కైవ్స్ ఫౌండేషన్కు రశేష్ అండ్ విద్య షా ఫామిలీ ఫౌండేషన్ నుంచి, కీస్టోన్ ఫౌండేషన్కు గ్లోబల్ సౌత్ అలయన్స్ నుంచి లభించిన సహకారంతో.

పాల్గొన్నవారు: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ ప్రజలు మరియు స్థానిక సముదాయాలు (ఐ పి ఎల్ సీస్), సముదాయ కలెక్టివ్‌లు, ఆర్కైవిస్టులు, సాంస్కృతిక కార్యకర్తలు, పరిశోధకులు మరియు సంస్థలు.

కార్యశాల సంక్షిప్త వివరణ

జ్ఞానం, జ్ఞాపకాలు మరియు సాంస్కృతిక వారసత్వంతో పనిచేస్తున్న ఆదివాసీ ప్రజలు మరియు స్థానిక సముదాయాలు (ఐ పి ఎల్ సీస్), జ్ఞాన కార్యకర్తలు, ఆర్కైవిస్టులు, పరిశోధకులు మరియు సంస్థలు ఈ కార్యశాలలో ఒకచోట చేరారు.

ఈ కార్యశాలలో దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలకు చెందిన 24 సముదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 57 మంది పాల్గొన్నారు.

వివిధ అనుభవాలు మరియు అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేలా ఈ సమావేశాన్ని రూపొందించారు. ఇది భాగస్వామ్యంతో కూడిన బహుభాషా వేదికగా జరిగింది. ఒకే ఒక పరిష్కారాన్ని కనుగొనడం కంటే, సముదాయాలు మరియు సంస్థల మధ్య వినడం, మాట్లాడుకోవడం మరియు ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడం ఈ కార్యశాలలో ముఖ్యంగా నిలిచాయి.

కలిసి చర్చించిన అంశాలు:

  • సముదాయం లోపలి నుంచి చూసినప్పుడు ఒక సముదాయ ఆర్కైవ్ ఎలా ఉండాలి?
  • సముదాయ అవసరాలు, గుర్తింపు మరియు భవిష్యత్తుకు ఆర్కైవ్‌లు ఎలా ఉపయోగపడగలవు?
  • ఏ జ్ఞానాన్ని పంచుకోవచ్చు? ఏ జ్ఞానాన్ని రక్షించాలి?
  • సమ్మతి, గౌరవం మరియు సామూహిక నిర్ణయాలను ఎలా నిర్ధారించగలం?
  • సముదాయాలు, సంస్థలు మరియు ఈ రంగంలో పనిచేసే వారు కలిసి పనిచేసేటప్పుడు ఎలాంటి పాత్రలు పోషించాలి?

ఐ పి ఎల్ సీస్ – 24

ఆలు కురుంబ, బ్యాక్వర్డ్ క్లాస్సెస్, బడగ, చెంచు, చోళనాయకన్, కోస్తా సముదాయాలు, దళితులు, హక్కి పిక్కి, ఇరుళ, ఇరుళిగ, కాడర్, కాట్టునాయకన్, కురబర్, కుర్చియ, లంబానీ, మలమలసర్, మలముత్తన్, మలసర్, మలయన్, ముతువన్, పనియా, సౌర సోలిగ మరియు తోడ

పాల్గొన్నవారు – 57

ఏ. చిరంజీవి, అజిత్ కుట్టన్, అఖిల జార్జ్, అరవింద్ అష్ఠర్స్, అరుణ్, అశ్వతి జి వి, బాణాల క్రాంతి కుమార్, భువన్, బిద్ధిక సుహాసిని, డేనియల్ సామ్రాజ్, ధరవయ్య, దుర్గ, దుర్గ మూర్తి, జి. అంజినమ్మ, గీత వి కే, జడేస్వామి ఎం, జెయంతి ఆర్, జె ఆర్ మణి, కారలన్, కావ్య కే, కుముద సుశీల్, లక్ష్మి ఎం, మదన్, మల్లికార్జున, మండ్లి అమూల్య, మండ్లి శివయ్య, మంజుల, మను చౌధురి. సి, మురుక్కన్, ఎన్. నరసమ్మ, నారాయణస్వామి, నీలకంట నాగప్ప కురుబర్, పి. చంద్రన్, పల్లవి, ప్రభు, రాజేశ్వరి, రాజు, రమేష్ కృష్ణన్, రెబ్బ ప్రకాష్, ఎస్ పాళయం, శరవణన్, సవర తోట మిన్నారావు, సీబు, షాలిని ఏ, శ్రీకాంత్, సుమిత్ర కే, సురేష్ పి, సుశీలప్ప, శ్యాంజిత్ పి కే, టి.బి దినేష్, టిజు సి థామస్, వి. వెంకటేష్, వసమల్లి కే, వినోద్ చెల్లన్, విష్ణు, యదుకృష్ణ కే ఆర్ మరియు యుగేష్.

ఆయోజకులు – 7

అంజలి జె ఆర్, అపర్ణ యు, ఫైసల్ ఆర్, రంజని పి, సమీరా ఏ, వెంకట్ ఎస్, వినయ్ కే

టిడియు సిబ్బంది మరియు అధ్యాపకులు అందించిన సహాయానికి మా ధన్యవాదాలు.

స్వచ్ఛంద సేవకులు – 12

అబిషయ్ జె, ధాత్రి ఎస్, ధాన్య ఎస్ ఆర్, దీపిక ఎస్, జానకీ ఎస్, నూరున్నిసా, ఓజస్ కె, పార్వతి వి, సంజన జి వై, శృతి ఎన్ జె, సుగన్య ఎస్, విద్య, రవి కె బి.

ఈ సమావేశం ఎందుకు ముఖ్యమైనది?

ఈ కార్యశాల ఒక దీర్ఘకాలిక ప్రయాణంలో భాగం.సముదాయాలు మరియు ఆర్కైవ్‌ల మధ్య మరింత బలమైన సంబంధాలను నిర్మించడం, వివిధ ప్రాంతాల అనుభవాలను పంచుకోవడం, అలాగే జ్ఞానంతో పనిచేయడానికి సముదాయాల అనుభవాల ఆధారంగా ఆచరణాత్మక పద్ధతులను అభివృద్ధి చేయడం అనే ప్రక్రియకు ఇది ఒక ప్రారంభం. ఈ సమావేశం నుంచి వచ్చిన అనుభవాలు మరియు నేర్చుకున్న విషయాలు భారతదేశంలో సముదాయ ఆర్కైవింగ్ పద్ధతులపై రూపొందించబోయే ఒక బహుభాషా మార్గదర్శకానికి ఉపయోగపడతాయి. ఈ మార్గదర్శకం ఇందులో పాల్గొన్న వారి స్వరాలు మరియు అనుభవాల ఆధారంగా రూపొందుతుంది. ఈ కార్యక్రమంతో కలిసి పనిచేయాలనుకుంటే, దయచేసి coarchives26@gmail.com కు రాయండి.

ఇక్కడ ప్రచురించిన ఏదైనా విషయాన్ని సరిచేయాలని లేదా తొలగించాలని కోరుకుంటే, దయచేసి coarchives26@gmail.com కు రాయండి.

ఛాయాచిత్రాలు

Symbol of memory exhibit

కార్యశాలలో ప్రదర్శించిన “జ్ఞాపక చిహ్నాలు” జ్ఞాపక చిహ్నం (సింబల్ ఆఫ్ మెమరీ):ఒక వ్యక్తి లేదా సముదాయం తమకు లేదా తమ సముదాయానికి జ్ఞాపకాలను సంరక్షించడం మరియు పంచుకోవడాన్ని సూచిస్తుందని భావించే వస్తువు.

CoArchives Group Photo

రెండు రోజుల కార్యశాల జరిగిన పతంజలి బ్లాక్ ముందు తీసిన గ్రూప్ ఫోటో.

Registration desk

రెండు రోజుల కార్యశాల జరిగిన పతంజలి బ్లాక్ ప్రవేశద్వారం వద్ద ఉన్న నమోదు డెస్క్.

Registration desk 2

అంజలి, దీపికా మరియు ధాన్య నమోదు డెస్క్ వద్ద కార్యశాలలో పాల్గొనేవారిని స్వాగతిస్తున్న దృశ్యం.

Memory desk 2

నమోదు తర్వాత సంజన కార్యశాలలో పాల్గొనేవారు తీసుకువచ్చిన ‘జ్ఞాపక చిహ్న’ వస్తువులను సేకరిస్తున్న దృశ్యం.

Telugu desk 1

అబిషయ్ తెలుగు భాషా సమూహంలో అనువదిస్తున్న దృశ్యం.

Malayalam desk 1

పార్వతి మలయాళ భాషా సమూహంలో గమనికలు తీసుకుంటున్న దృశ్యం.

Anjali at podium

తెలుగు భాషా సమూహంలోని ఒక పాల్గొనేవారు అంజలి నిర్వహిస్తున్ప్ర సంభాషణను నమోదు చేస్తున్న దృశ్యం.

Kannada desk - babysitting

కార్యశాలలో పాల్గొన్న అతి చిన్న వయస్సుగల వారిని సంజన చూసుకుంటున్న దృశ్యం.

Faisal - Keystone

కీస్టోన్ ఫౌండేషన్కు చెందిన ఫైసల్ హక్కులు మరియు బాధ్యతల మ్యాపింగ్ పై సంభాషణను నిర్వహిస్తున్న దృశ్యం.

Anjali - Podium - IPLC and Archives

అంజలి ఆర్కైవ్‌ల పరిచయం మరియు అవి ఆదివాసీ ప్రజలు మరియు స్థానిక సముదాయాలతో (ఐ పి ఎల్ సీస్) కలిగి ఉన్న సంబంధం గురించి సంభాషణను నిర్వహిస్తున్న దృశ్యం.

Tamil desk

తమిళ భాషా సమూహం చర్చలో పాల్గొంటున్న దృశ్యం.

Venkat - Milli - IP

మిల్లి ఆర్కైవ్స్ ఫౌండేషన్కు చెందిన వెంకట్ మేధో సంపత్తి (ఇంటెలెక్చల్ ప్రాపర్టీ) పై సంభాషణను నిర్వహిస్తున్న దృశ్యం.

Kannada desk - Samira - Facilitation

ది యూనివర్సిటీ అఫ్ ట్రాన్స్-డిస్సిప్లినరీ హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (టి డి యు) కు చెందిన సమీర నాయకత్వంలో ఐ పి ఎల్ సీస్ కోసం మరియు ఐ పి ఎల్ సీస్ తో కలిసి ఆర్కైవ్‌లను పునఃకల్పించడం అనే అంశంపై కన్నడ భాషా సమూహం చర్చిస్తున్న దృశ్యం.

Anjali - Archives at NCBS - Facilitation

ఆర్కైవ్స్ ఎట్ ఎన్ సి బి ఎస్ కు చెందిన అంజలి, వినయ్ తో కలిసి ఫెయిర్ మరియు కేర్ సూత్రాల పరిచయం అనే సెషన్‌ను సహ-నిర్వహిస్తున్న దృశ్యం.

IPLC memory keeping terms

ఐ పి ఎల్ సీస్ సముదాయాలు జ్ఞాపకాలను సంరక్షించడానికి మరియు పంచుకోవడానికి ఉపయోగించే పదాలు మరియు భావనలు.

Dhanya - Telugu desk

ధాన్య తెలుగు భాషా సమూహంలోని ఒక సెషన్‌ను ఆడియో రికార్డ్ చేస్తున్న దృశ్యం.

Tamil desk 2

తమిళ భాషా సమూహం చర్చలో పాల్గొంటున్న దృశ్యం.

Dhanya - Telugu desk 2

ధాన్య తెలుగు భాషా సమూహంలో అనువదిస్తున్న దృశ్యం.

Malayalam desk 2

మలయాళ భాషా సమూహం ఒక సెషన్‌లో పాల్గొంటున్న దృశ్యం.

Workshop activity

మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రమత్తును తొలగించడానికి సమీర నిర్వహించిన ఒక సరదా కార్యక్రమం.

Ranjani - Keystone - Tamil desk

కీస్టోన్ ఫౌండేషన్కు చెందిన రంజని తమిళ భాషా సమూహంలో అనువదిస్తున్న దృశ్యం.

Aparna - Antara Advisory - Telugu desk

అంతర అడ్విసోరీకు చెందిన అపర్ణ తెలుగు భాషా సమూహంలో అనువదిస్తున్న దృశ్యం.